Akhilatmakaa Upload Your Music Free

Singer : Kanakesh Rathod : Lyrics : Lakshmi Valli Devi Bijibilla - Akhilatmakaa


Published Feb. 8, 2019
133 views
Genre: Devotional
Album: Sudhanva Sankirtanam : Telugu Devotional Songs
released: 2014

Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla.  Music composed and Keyboard programmed by Music Director Kanakesh Rathod.  Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India.  Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod.  Presented by Bijibilla Foundation.


Lyrics

అఖిలాత్మకా

 పల్లవి  :  అఖిలాత్మకా! అఖిలాత్మకా [2]

                    అఖిలరూపమ్ముల, ఆత్మవు, పరమాత్మ [అఖిలా]

చరణం :  నీ పదములే, మా  యిహ పరమ్ములు

                    ఆర్త రక్షణ నీకు, అందెవేసిన చేయి [2]

                    నిగమాగమా!  నీ యోగ నిద్రలో [2]

                    జగములు కాచేవు, జగదాధారా! [అఖిలా]

చరణం :  బ్రహ్మవిద్యలు  నేర్వగదుర్లభం

                    నీకృప వుంటే, అవి వెన్నతొ పెట్టు విద్యలే  

                    ఓకృపానిధీ! నీకరుణె వుంటే  [2]

                   సాధ్యము కానిది ఏమున్నదయ్యా [అఖిలా]

 

ముందుమాట

జగదాధారుడు, పరంధాముడు, స్థితికారకుడు శ్రీమహావిష్ణువు. ఆయన అపారమైన "కరుణ"అను సుగంధపరిమళము ఈ జగతిపై గరికపూవులమైన మనపై ప్రసరించాలని కోరుకుందాము. సదా ఆ పరమాత్మునకు మనమందరము కృతజ్ఞులమై వుందాము. ఆ దయామయుని దయాంబుధిలో మనము, ఈ జగమంతా ఆనందపరవశంతో ఓలలాడుదాము. మనము ఒక మంచిపుస్తకము లేదా గ్రంధమును చదువుతున్నప్పుడు మన మనసు ఎంతో ఆనందానుభూతులను పొందుతుంది. అందులోని అందమైన, అర్ధవంతమైన పదజాలం, భావం మనలను ఒక అద్భుతలోకములకు తీసుకొని వెళుతుంది.  అదేవిధముగా సత్సంగసాంగత్యంవలన మనలోని వ్యతిరేకభావములకు ఆనకట్ట వేయగలము.  ఒకవిషయముపై స్థిరమైన అవగాహన, నిర్ణయ నిర్ధిష్టత ఏర్పడతాయి. అనగా ఒకమనిషి ఆలోచనా పరంపరలను విషయాసక్తిపై శ్రద్ధకాక, మంచి విషయాలపై కేంద్రీకరిస్తాము. ఎంతోవున్నతంగా ఒకమనిషి ఎదుగ  గలుగుతాడు. "పుస్తకపఠనం, సత్సాంగత్యం "అనునవి ఒకమనిషివున్నతికి, అభివృద్ధికి పునాదిఅవుతాయి.

భగవంతుడు మనకు ప్రసాదించినదానిని పదిమందికీపంచి సంతోషంగా జీవించాలన్నది ఆర్యోక్తి. ఎందరో వేదవేత్తలు, గ్రంధకర్తలు, వాగ్గేయకారులు, శాస్త్రవేత్తలు మరిఎందరో మహానుభావులు త్రికరణశుద్ధిగా వారుఆచరించి అపారమైనజ్ఞానసంపదను మనకందించారు. దానిని మనము ముందుతరాలకు అందేవిధంగా కాపాడవలసిన భాద్యత మనకున్నది. కృతయుగంనాటినుండి, తపసులు, యోగలు, పురాణపురుషులు, మున్నగువారు, మనం ఎలాజీవించాలో ఆధ్యాత్మికతను మనజీవనంలో ముఖ్యమైన భాగముగా ఎలా అలవరచుకోవాలో తెలిపారు. వారు గతించిన తరువాతకూడా వారినడవడిక, సన్మార్గముమనకు మార్గదర్శకాలుగా వున్నాయి. అసలు"పరమాత్మతత్వం" తెలుసుకొనుట అనునది ఒకఅపురూప, అనిర్వచనీయభావన. "సృష్టినేసృష్టించిన ఆ సృష్టికర్తనుగూర్చి తెలుపగల పదములు సృష్టించగలమా"! "ఆధ్యాత్మికత"అను పరిమళపూబాటలో సాగుతూ అమృతానుభూతిని పొందుతూ పదిమందికీ మార్గము చూపడమే మనఅందరికర్తవ్యం. అంతర్లీనంగా నీలోయున్న పరమాత్మను చూచినచో ఈప్రపంచం, విశ్వమంతా ఒక నందనవనంగా  కానవస్తుంది. 

నాయీ వుడుతాభక్తిగా రచించిన యీ గేయసంపుటిని(పుస్తకమును) అందరూ ఆనందంగా ఆస్వాదించాలని ఆపరమాత్ముని కోరికగా భావిస్తున్నాను.  ఆయన నాకు అందించిన యీ ప్రసాదాన్ని పదిమందీ ఆరగించి, ఆనంద, ఆధ్యాత్మికానుభూతి పొందాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ "సుధన్వాసంకీర్తనం" అనే గేయసంపుటి, సంగీతవిద్వాంసులకు రాగములు కూర్చుటకు సహాయపడాలని విశ్వసిస్తున్నాను. సంగీతవిద్యార్ధులు వారిగురువులద్వారా క్రొత్తఒరవళ్ళు నేర్చుకోవలెనని ఆశిస్తున్నాను. విద్యార్ధులు సంగీతలోకానికి ఆధ్యాత్మికబాటలు వేయాలని కోరుకుంటున్నాను.  ఆపరమాత్మ తనగొప్పమనసుతో యిచ్చిన ఈ సదవకాశాన్ని, నా యీచిన్నప్రయత్నాన్ని, అందరూ పెద్దమనసుతో ఆదరించగలరని కోరుచున్నాను.

"సంగీతము"అనే వుద్యానవనంలో పూబాలల రాగాలపుప్పొడిలో మధుర తేనీయలోలకాలని తేనియవూటలై ప్రతిహృదయాన్ని"ఆధ్యాత్మికత" అను బిందువులలో తడపాలని, విద్వాంసులు ఆ చిత్తడిలో“పుత్తడి”గా మెరవాలని, నా కోరిక, ఆశయం. 

నా యీప్రయత్నంలో ఏమైన దోషములు వున్నయడల పెద్దమనసుతో మన్నించగలరు.

 రచయిత్రి

బిజిబిళ్ళలక్ష్మీవల్లీదేవి

ఓం

రచన:  "కవిరాజు, సాహితీ యువరత్న" డా. కావూరి శ్రీనివాస్ నంది అవార్డు గ్రహీత, కవి, శాసన తాళపత్ర గ్రంధ పరిశోధకుడు మరియు పరిశోధన అధికారి, తెలంగాణా పర్యాటక శాఖ, (బుద్ధవనం), హైదరాబాదు. 

వాగ్దేవీనమ:                      నమ:                శ్రీ శారదా ఓం

                                   భక్తినివేదన

అమ్మగారు శ్రీమతి బిజిబిళ్ళ లక్ష్మీవల్లీదేవి గారి హస్తాక్షర, సుమధుర, సుమనోహర "సుధన్వాసంకీర్తనామృతం" భక్తిత్వానికి - ముక్తిత్వానికి ఇది ఎంతో విలువైన సంకీర్తనల సంపుటి.  ఇందులో ఆధ్యాత్మిక-భక్తి-తత్వ గేయములు విపులంగా విశదీకరించి వ్రాసినారు.  ఈ మన భారతావనిలో ఎందరో మహానుభావులు రచించిన సంకీర్తనలను, తత్వములను, రగడలను, స్తోత్రములను, దండకములను, గేయములను (పాటలను) ఇంకా ఇతరత్రా ఎన్నో భక్తికి సంభందించినవి ఉన్నాయి.  అయితే కొందరు మాత్రమే వెలుగులోకి వచ్చారు.  మరికొందరు చరిత్ర గర్భంలోనే మిగిలిపోయారు.  వారిలో 13వ శతాబ్దం నాటి షడాక్షరస్వామి, 14, 15 శతాబ్దములనాటి కృష్ణమాచార్యులు, ఇలా ఎందరో, అయితే ఒక్కక్కరూ ఒక్కొక్క ఒరవడిని సృష్టించారు.   అమ్మగారు వ్రాసిన ఈ సంకీర్తనల్లో అన్నీ మృదు మధురంగానే ఉన్నాయి అనుటలో ఏ మాత్రం కించిత్ సందేహములేదు.  భక్తులు, అశేష ప్రజానీకం, ఆదరించి, ఈ సంకీర్తనలను భక్తితో చదివి ధన్యులౌతారని నా ప్రగాఢ విశ్వాసం.  ఇందులో, మృదు మధ్యాక్కర-మాత్రా-అలంకార భావాలతో కూడుకున్న భక్తి సంకీర్తనలు ఇవి.  ఒకచోట అమ్మగారు ఇలా అంటారు చూడండి.

"అంబా, జగదంబా" గేయంలో చివరి చరణంలో…..

"చరణం": అష్ట దిక్కులు పాలించే పరమేశ్వరి - పరమపావని (2)

దుష్ట సంహారిణి, దురిత విమోచని నీవు అంబా, జగదంబా "అంబా" (2)

ఇటువంటివి ఎన్నో ఉన్నాయి.  తల్లులగన్న తల్లి మహాతల్లి చతుర్దశ భువనాల శక్తి స్వరూపిణీ నాతల్లి దయ ఈ తల్లిపై దండిగా ఉండాలని మరెన్నో మహోన్నత సంకీర్తనలను వ్రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ!!!

"శుభంభూయాత్" - శ్రేయోస్తుతేసదా!!!

డా. కావూరి శ్రీనివాస్

ఓంశ్రీసాయిరాం

                                                                                                      హైదరాబాద్                                                                                            05-04-2016

ఆచార్య పోతుకూచి ఉమాభట్టీశ్వరశర్మ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్.డి.  అతిథి ఆచార్యులు,

హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం, హైదరాబాద్.

 

"భక్తిరేవగరీయసీ" – అన్నారు ప్రాజ్ఞులు. భగవంతునికంటె భగవద్భక్తులే శ్రేష్ఠులని నిరూపింపబడిన ఘట్టాలకు మనపురాణాలలో కొదువలేదు.  భగవంతుడు భగవద్భక్తుల సంకీర్తనలలో కొలువై ఉంటాడని నారద ఉవాచ. ఈ అన్నివిషయాలనూ ఆకళింపుచేసుకొన్న మహిళామణి శ్రీమతి బిజిబిళ్ళ లక్ష్మీవల్లీదేవి గారని నా అభిప్రాయము.

కాబట్టే త్యాగయ్య, అన్నమయ్య, పురందరదాసు, రామదాసు వంటి భక్తశిఖామణుల సంకీర్తనలకేమాత్రము తీసిపోని విధంగా తమ "సుధన్వాసంకీర్తనం" రచనాగ్రంధము సాగించారనటం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో.  ప్రతికీర్తన ఒకరసగుళిక.   నా పూర్వజన్మ పుణ్యఫలాన నేను ప్రస్తుతకవయిత్రి తండ్రిగారైన "బ్రహ్మశ్రీ రావిపాటి బాలగురునాధశర్మగారి" కొన్ని పారమార్ధిక వ్యాసాలను చదవటం తటస్థించింది. అలాంటి మహనీయుని పుత్రికకు భక్తిరస భావబంధురమైన కవిత ప్రాప్తించటం ఆశ్చర్యమేమీకాదు.  పైగా అది సహజంకూడా.

"సుధన్వాసంకీర్తనం" - అనే ఈ మధుర భక్తిరసకావ్యం మధురాతి మధురమైన కీర్తనలతో నిండిఉంది."పోతన్నతెల్గులపుణ్యపేటి" అని విశ్వనాథ సత్యనారాయణగారు పోతన కవిత్వాన్నిమెచ్చుకొన్నారు. శ్రీమతి లక్ష్మీవల్లీదేవి గారు కూడా పోతన మహాకవికి ఏమాత్రం తీసిపోనివిధంగా భక్తిరసమాధుర్యంతో తమకీర్తనలను నింపివేశారు. వారికి నామనఃపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 

భవదీయుడు

డా. పోతుకూచి ఉమాభట్టీశ్వరశర్మ (M) 8186818811

శ్రీ

ఆచార్య ఎన్.ఎస్.రాజు, విశ్రాంత అధ్యక్షులు, తెలుగుశాఖ, హైదరాబాదు కేంద్రవిశ్వవిద్యాలయం 297, డోయెన్కాలని, శేరిలింగంపల్లి, హైదరాబాదు. 

         10-04-2016

శ్రీమతి బిజిబిళ్ళ లక్ష్మీవల్లీదేవిగారు రచించిన "సుధన్వా సంకీర్తనం" అనే సంపుటి గ్రంథంలో 148 కీర్తనలు ఉన్నాయి. అవి 12 విభాగాలుగా విభక్తమయ్యాయి. ఈ కీర్తనలు భక్తిభావతన్మయత్వంలో వెలువడిన భక్తిరసగుళికలు.  భగవంతుని సుప్రభాతసేవ, పవళింపుసేవ మొదలైన సేవలను కీర్తించినట్లు రచయిత్రి ఈసంపుటిని భగవంతుని ఉపనయనసేవ సంకీర్తనంతో ప్రారంభించి ఒక ప్రత్యేకతను నిలిపారు.  శ్రీకృష్ణ స్తుతులతో మొదలైన ఈసంకీర్తనలలో క్రమంగా శ్రీరామ, వినాయక, శివ, దుర్గ, ఆంజనేయ, వేంకటెశ్వర, లక్ష్మి, పాండురంగ, శ్రీహరి, సత్యనారాయణ మొదలైన అర్చనారూపదేవతామూర్తుల స్తుతులు ఉన్నాయి.  ఈకీర్తనలలో సగుణరూప  వర్ణనతోపాటుగా నిర్గుణ పరబ్రహ్మమును కూడా వర్ణించడం రచయిత్రి ఆధ్యాత్మిక పరిణతికి నిదర్శనం.  కీర్తనలు చిన్న చిన్న పదాలతో సరళమైన కూర్పుతో సహజమైన రచనగా ఒప్పుతున్నాయి. ఈసంకీర్తనలు అనుప్రాసలు, పద-అక్షర ఆవృత్తులతోను, ఆది-అంత్యప్రాసలతోను అప్రయత్న మాత్రాఛందస్సుతోను, కూడి శ్రావ్యతాగుణంతో భాసిస్తున్నాయి.  భావరమణీయంతోపాటు శాబ్దికరమణీయంకూడా చాలా కీర్తనలలో కనబడుతుంది.

"కృష్ణం మధురం నీజననం

బాలకృష్ణం సతతం నీస్మరణం"

మొదలైన పల్లవులు జయదేవునిగీతగోవిందాన్ని స్మరణకుతెస్తున్నాయి.

"దోబూచులాడేవురా కృష్ణయ్యా! 

బూచులు దునిమేటి అల్లరి కన్నయ్యా!"

"శకటాసురుని దన్నినపదములు

నొప్పిగొనినవా! చక్కని స్వామీ!

పూతనప్రాణముహరియించిన

నీనోరునొప్పిగొనినదా స్వామి"

మొదలైన గేయపంక్తులు భక్తిభావాన్ని ఆలంకారికంగా ప్రకటించడాన్ని వెల్లడిచేస్తున్నాయి.  "అలరాముడైననూ”(27) "ఇలలోన" (29)వంటి కీర్తనలుదీనికి మరి కొన్నినిదర్శనలు. 

నిర్గుణ పరబ్రహ్మమును కాంతిస్వరూపంగా సంభావించడాన్ని "ఈలోకమంత వెలుగు – మనశోకమంత తొలగు" వంటి పాదాలలో రచయిత్రి ప్రకటించడం వారి తాత్విక భావ సంపదకు ఉదాహరణం.

"ఆటపాటల జోల ...విద్యార్జన హేల ...

వయసుడిగిన వేళ ... వేదాంత ఊయల  ..........."వంటి పాదాలు అంత్య ప్రాసకు,

"ముద్దులకృష్ణుడె.......ముత్యపుటుంగరముల..........., పరమాత్ముడు..........పరముతానై............." వంటి

పాదాలు ఆద్యక్షరావృత్తికి నిదర్శనలు. "చెరసాలలో జరిగెను జననం, చెఱలు విడిపించు నీ చరణం (17) వంటి పాదాలుఆదిప్రాసకు నిదర్శనలు.  ఇలా చాలా కీర్తనలు కవితా సౌందర్యాన్నికూడా ప్రకటిస్తున్నాయి.

ఈవిథంగా వీరి సంకీర్తనల సంపుటినుంచి ఎన్ని విశేషాలనైనా చూపవచ్చు. గీతా మాధుర్యానికి గనివంటి “సుధన్వా సంకీర్తనల” సంపుటిద్వారా రచయిత్రి మరొక మీరాబాయిగా వాసికెక్కగలరని విశ్వసిస్తూ వారికి సర్వమంగళములు కలుగజేయవలసిందిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను.

 శుభం.

నడుపల్లి శ్రీరామరాజు

ఓంనమోభగవతేవాసుదేవాయ! ఓంనమోవేంకటేశాయ! ఓంనమోశ్రీవిఘ్నేశ్వరాయ!

అభినందనలు

 

ప్రియమైన సోదరి శ్రీమతి లక్ష్మీవల్లీ దేవికి మీ సోదరుడు సుబ్రమణ్య శర్మ శుభాభి నందనలతో వ్యక్తపరుస్తున్న విషయములు:

మీరు ఎంతో భక్తిశ్రద్ధలతో పంపిన "సుధన్వాసంకీర్తనం" రచనాగ్రంధము అందినదని తెలియపరచుటకు సంతోషిస్తున్నాను.  ఆ భగవంతునిపై రచించిన కీర్తనలు ఎంతో శ్రద్ధతో చేసారు.  సదా భగవదానుగ్రహం కలుగు గాక.  అన్ని జన్మలలో మానవ జన్మ చాల అత్యుత్తమమైనదని, అట్టిమానవులు సదా భగవంతుని స్మరిస్తూ మరో జన్మ లేనివారిగా మోక్ష ప్రాప్తి పొందటానికి ప్రయత్నించాలని భగవద్గీత విశదీకరిస్తున్నది.

ప్రతి మానవడు నవ విధ భక్తి విధానముల ద్వారా భగవంతుని చేరవచ్చ్హని గీతోపదేశం చేస్తున్నది.  మీరు రచించిన ఈ సంకీర్తనలలో ప్రతి అక్షరము, పదము మరియు వాక్యము భగవంతుని స్మరిస్తూ అత్యున్నతమైన మోక్షమార్గమును సూచిస్తున్నాయి అనుటలో ఏ మాత్రం సందేహము లేదు. 

ఈ భగవన్నామ స్మరణ తత్వము ఎన్నో జన్మల పుణ్యఫలము మరియు సత్కార్యముల చేతనే లభిస్తుంది. ఈ సంకీర్తనలు ఎంతో మ్రుదుమధురంగాను, ఆహ్లాదకరంగాను మనస్సుకి సంతృప్తినిచ్చేవిగాను ఉన్నాయి.  మీరు రచించిన ఈ రచనా గ్రంధము భావితరాలకు ఎంతో ఉపయోగకరము మరియు ఆదర్శప్రాయంగా నిలుస్తుందనటంలో ఎటువంటి సందేహములేదు.  కేవలం ఒక్క భగవంతుని స్మరణ మార్గము ద్వారా మాత్రమే జన్మ బంధముల నుండి విముక్తి పొందుతారని, భగహదానుగ్రహముకంటే మనిషికి ఇంక ఏమి కావాలి?  ఇన్నివందల కీర్తనలు రచించిన మీకు ఆ భగహదానుగ్రహం తప్పక లభిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం.  భగవంతుని స్మరణకు మించినది ఈ ప్రపంచములో మరొకటి లేదు. మీ సంకీర్తనలద్వారా ప్రజలందరిని చైతన్య పరచి దైవ స్మరణ చేయిస్తున్న మీకు ఆ భగవంతుడు నిరంతరం  ఆశీర్వదించుగాక!

రావిపాటి సుబ్రమణ్య శర్మ, ఆఫీసర్, ఆంధ్రా బ్యాంక్ (రిటైర్డు)

 

 

Share this song on Facebook
Total comments 2
Ramarao Bijibilla March 17, 2020
Ramarao Bijibilla March 17, 2020
Devotional : Bhakthi : Spiritual : Sudhanva : Sankirtanam : Hariom : Inspirational : Easy Listening : Classical

Albums / Discography

Sudhanva Sankirtanam 2020 Upload Your Music Free

Sudhanva Sankirtanam 2020

by Singer : Soban Babu Ganta released 2020
Classical
Sudhanva Sankirtanam : Telugu Devotional and Spiritual Songs Upload Your Music Free

Sudhanva Sankirtanam : Telugu Devotional and Spiritual Songs

by Singer : Laxmi Gayathri released 2014
Classical
Sudhanva Sankirtanam : Telugu Devotional Songs Upload Your Music Free

Sudhanva Sankirtanam : Telugu Devotional Songs

by Singer : Raman Rathod released 2014
Classical

Feb. 8, 2019

Akhilatmakaa

Sudhanva Sankirtanam is a Devotional Album written by Lakshmi Valli Devi Bijibilla.  Music composed and Keyboard programmed by Music Director Kanakesh Rathod.  Recorded at 'S' rec.in Hyderabad, Telangana State, India.  Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod.

Data Privacy Notice-Music We Make (https://www.musicwemake.com) uses cookies to track site activity through Google Analytics and shows advertisements through Google Adsense. Music We Make also collects membership information that you provide to the site such as your username, email address, song/music data, favorites, likes, votes, comments, purchase information, etc... (USAGE DATA) that is kep privately at Music We Make for the sole purpose of providing our online services as a platform to promote your music and is not sold to any third parties for any reason. As a Music We Make member, you may delete your data at any time either by deleting individual songs or comments, or by deleting your entire account.